పులివెందులకు షర్మిల

by  |
పులివెందులకు షర్మిల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన వైఎస్ షర్మిల.. పార్టీ ఏర్పాటుపై నేతలు, అభిమానులతో వరుసగా లోటస్‌పాండ్‌లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లా, మండల కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన షర్మిల.. త్వరలో కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నారు. కొత్త పార్టీ పనుల్లో బిజీబిజీగా ఉన్న షర్మిల.. గత కొంతకాలంగా హైదరాబాద్‌కి పరిమితమయ్యారు.

అయితే చాలాకాలం తర్వాత సోమవారం పులివెందులకు వైఎస్ షర్మిల చేరుకోనున్నారు. తన సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు షర్మిల పులివెందులకు వస్తున్నారు. మార్చి 16న కుటుంబ సభ్యులతో కలిసి వివేకాకు షర్మిల నివాళులు అర్పించనున్నారు. కాగా 2019 మార్చి 16న వివేకా హత్యకు గురైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story