- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌కే పంపుతాం: జగన్
వివిధ కారణాలతో విదేశాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులు రేపు స్వస్థలానికి చేరుతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమెరికా నుంచి వచ్చే తెలుగువారు ముంబై, హైదరాబాదు, చెన్నై విమానాశ్రయాలకు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి విశాఖ, గన్నవరం, తిరుపతి మీదుగా స్వస్థలాలకు చేరుతారని చెప్పారు.
వారందరికీ వైజాగ్, తిరుపతి, విజయవాడల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వారందర్నీ దగ్గర్లోని క్వారంటైన్ కేంద్రాలకు పంపుతామని స్ఫష్టం చేశారు. వారందరికీ ఉచిత వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల పరిశీలనలో ఉంచుతామని తెలిపారు. క్వారంటైన్ పూర్తయిన తరువాత కరోనా నెగిటివ్ వచ్చిన వారిని వారి ఇళ్లకు పంపుతామని అన్నారు.
దీంతో రాష్ట్రంలోకి 11 చెక్ పోస్టుల ద్వారా ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు సీఎంకి సూచించారు. దీంతో చెక్ పోస్టుల వద్ద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రవేశించిన వారు అనుమతి పొందినా గమ్యం చేరేవరకు వారిని అడుగడుగునా పర్యవేక్షిస్తామని అన్నారు. గ్రామాల్లో వలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు హోం క్వారంటైన్ పాటించేలా చేస్తారని చెప్పారు.