గవర్నర్ బీబీ హరిచందన్‌కు సీఎం జగన్ ఫోన్

by srinivas |
ap governar
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనాతో చికిత్సపొందుతున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం జగన్‌ గవర్నర్‌కు తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ వచ్చిన గవర్నర్ బిశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్‌.. గ‌త‌ మూడు రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు.

దీంతో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే బుధవారం ఉదయం ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడంతో రాజ్‌భవన్ సిబ్బంది ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గవర్నర్ హరిచందన్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story