ఏపీ సీఎంవోలో కీలక మార్పులు

by srinivas |
ఏపీ సీఎంవోలో కీలక మార్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ సీఎంవోలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. డిపార్ట్‌మెంట్ల వారీగా బాధ్యతలు విభజన చేశారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులకు వివిధ శాఖల బాధ్యతలను అప్పగిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్‌కు జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, లా తదితర శాఖలను అప్పగించారు. అరోకియారాజ్‌కు ట్రాన్స్‌పోర్టు, ఆర్అండ్‌బీ, ఆర్టీసీ, హౌసింగ్, సివిల్ సప్లైస్, ఇండస్ట్రీస్, పంచాయతీ రాజ్, విద్య, సంక్షేమ శాఖలు, ఐటీ, కార్మిక ఉపాధి కల్పన శాఖలు, ధనుంజయరెడ్డికి నీటి వనరులు, అటవీ, పర్యావరణ, పట్టణాభివృద్ధి, మున్సిపల్, విద్యుత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలతో పాటు పర్యాటక, సాంస్కృతిక, క్రీడా యువజన సర్వీసులను అప్పగించారు.

Advertisement

Next Story