- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రామీ అవార్డుల్లో రైతు ఉద్యమం.. వినూత్నంగా మద్దతు తెలిపిన లిల్లీ సింగ్
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. గ్రామీ అవార్డుల్లో రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రముఖ యూట్యూబర్ లిల్లీ సింగ్ (కెనడా) చేసిన పని అందరినీ ఆలోచింపజేసింది. లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న గ్రామీ అవార్డుల్లో పాల్గొన్న లిల్లీ సింగ్.. ‘నేను రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నాను’ అని రాసి ఉన్న ఫేస్ మాస్కును ధరించింది.
ఈ మేరకు ఆమె తన Instagramలో ఒక పోస్టును ఉంచింది. ‘గ్రామీ అవార్డుల వేడుకలో రెడ్ కార్పెట్, అవార్డులు తీసుకుంటున్న వారి ఫోటోల కవరేజీ ఎక్కువ ఉంటుందని నాకు తెలుసు. ఇక్కడ చూడండి (ఒక వర్గం మీడియాను ఉద్దేశిస్తూ) ఇది ధరించినందుకు సంకోచించకండి..’ అంటూ పోస్ట్ చేసింది. లిల్లీ సింగ్ ఈ పోస్టు చేసిన కొద్దిసేపటికే ఇంటర్నెట్‌లో ఇది వైరలైంది. ప్రముఖ మోడల్ అమంద కెర్నీ, WWE రెజ్లర్ సునీల్ సింగ్ ఈ పోస్టుకు లైక్ కొట్టడమే గాక కామెంట్ కూడా చేశారు. కెనడాలో పుట్టి పెరిగిన లిల్లీ సింగ్ తల్లిదండ్రులు పంజాబ్ నుంచి వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
గతనెలలో ప్రముఖ పాప్ సింగర్ రిహాన్నాతో పాటు అంతర్జాతీయ పర్యావరణ వేత్త గ్రెట థన్‌బర్గ్ కూడా రైతుల ఉద్యమానికి మద్దతిస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత ప్రభుత్వం దానిని తీవ్రంగా ఖండించింది. వారి ట్వీట్లను తొలగించాలని ట్విట్టర్, ఫేస్‌బుక్‌లపై ఒత్తిడి తీసుకొచ్చింది. భారత్‌లో ఉండాలంటే ఇక్కడి చట్టాలను ఫాలో కావాల్సిందేనని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా లిల్లీ సింగ్ పోస్టు కూడా అంతర్జాతీయంగా రైతు ఉద్యమాన్ని మరోసారి చర్చనీయాంశంగా మార్చడం గమనార్హం.