‘కేంద్రం ఆదేశిస్తే ఎంఐఎం సపోర్టర్‌ను బ్లాక్ చేస్తాం’

by Anukaran |
‘కేంద్రం ఆదేశిస్తే ఎంఐఎం సపోర్టర్‌ను బ్లాక్ చేస్తాం’
X

ముంబయి: కేంద్ర ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశిస్తే మతపరమైన అల్లర్లకు తావిచ్చే పోస్టు చేసిన ఏఐఎంఐఎం (AIMIM) మద్దతుదారుడిని బ్లాక్ చేస్తామని ఫేస్‌బుక్, యూట్యూబ్ (Facebook, YouTube) సంస్థలు బాంబే హైకోర్టులో అభిప్రాయపడ్డాయి. సోషల్ మీడియా (Social media)లో నేరాపూరిత విద్వేష ప్రసంగాలను అప్‌లోడ్ చేసిన అబు ఫైజల్‌ (Abu Faisal)పై చర్యలు తీసుకోవాలని ముంబయి వాసి ఇమ్రాన్ ఖాన్ (Mumbai resident Imran Khan) బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

అబు ఫైజల్ (Abu Faisal) ఏఐఎంఐఎం (AIMIM)కు మద్దతునిచ్చేవారని ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది వివేక్ శుక్లా (Advocate Vivek Shukla) చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా (Chief Justice Deepankar Dutta) నేతృత్వంలోని డివిజన్ బెంచ్‌ (Division Bench)కు వివరించారు. ఆ వీడియోలను తొలగించడంతోపాటు సోషల్ మీడియా వెబ్‌సైట్ల (Social media websites)లో అతనిపై పూర్తిగా నిషేధం విధించాలని ఇమ్రాన్ ఖాన్ పిటిషన్‌ (Petition)లో అభ్యర్థించారు.

అబు ఫైజల్ (Abu Faisal) అప్‌లోడ్ చేసిన వీడియోలు తొలగించినట్టు ఫేస్‌బుక్ కౌన్సెల్ డేరియస్ ఖంబాటా (Facebook Counsel Darius Khambata), యూట్యూబ్ అడ్వకేట్ నరేష్ థక్కర్ (YouTube Advocate Naresh Thakkar) ధర్మాసనానికి వివరించారు.

ఐటీ చట్టం (IT Act)కింద సదరు యూజర్‌ వెబ్‌సైట్ల(User‌ websites)ను యాక్సెస్ చేయకుండా బ్లాక్ (Block) చేయాలని కేంద్ర సర్కారు (Central Government) ఆదేశించినా లేదా కోర్టు ఆదేశించినా బ్లాక్ చేస్తామని తెలిపారు. ఇంటర్నెట్‌లో పోస్టుల (Internet Posts )పై అభ్యంతరానికి నోడల్ అధికారి (Nodal Officer)ని సంప్రదించే అవకాశాన్ని ఐటీ చట్టం (IT Act) కల్పిస్తున్నదని, పిటిషనర్ (petitioner) నోడల్ అధికారి (Nodal Officer)ని కలిశారో లేదో వివరించాలని అడ్వకేట్ వివేక్ శుక్లాను (Advocate Vivek Shukla) ధర్మాసనం (Jury) ఆదేశించింది. ఇందులో కోర్టు జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరమేముందని అభిప్రాయపడింది.

Advertisement

Next Story