కాంగ్రెస్ వైపే యువత చూపు : కౌన్సిలర్ జ్యోత్స్నా శివారెడ్డి

by Shyam |
కాంగ్రెస్ వైపే యువత చూపు : కౌన్సిలర్ జ్యోత్స్నా శివారెడ్డి
X

దిశ, కుత్బుల్లాపూర్ : కాంగ్రెస్ వైపే యువత చూస్తుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నాయకురాలు, కౌన్సిలర్ కందాడి జ్యోత్స్నా శివారెడ్డి అన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క పుట్టినరోజును పురస్కరించుకొని షాపూర్‌నగర్ లో ఎంఎస్‌యూఐ నాయకులు గొల్ల జాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ పాలన పై ప్రజలు విసుగు చెందారన్నారు. రేవంత్ రెడ్డి కి పీసీసీ రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చిందన్నారు. పార్టీ ని కుత్బుల్లాపూర్ లో బలోపేతం చేయడం కోసం పని చేయాల్సిన అవసరముందన్నారు. అనంతరం ప్రైవేట్ అధ్యాపకులు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయికిరణ్, రాకేశ్, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed