- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలమూరులో ‘యూత్’ పాలిటిక్స్..!
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: వెనుకబడ్డ ప్రాంతంగా పేరున్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో యువత ఓ వైపు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు రాజకీయ రంగప్రవేశానికి అడుగులు వేస్తోంది. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజలకు చేరువ కావడానికి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమకంటూ గుర్తింపును పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో విస్తృతంగా ప్రచారాలు చేసుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ప్రధాన రాజకీయ పార్టీలలో చేరగా.. మరికొంతమంది అనుకూలంగా ఉన్న పార్టీలలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. వీరిలో కొంతమంది కుటుంబ సభ్యులు ఇప్పటికే రాజకీయాల్లో ఉండగా, ఇంకొందరేమో కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే యువ నేతలు ప్రజలకు చేరువ కావడానికి ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రత్యేకించి యూత్ మెచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే..
రాజకీయంగా ఆసక్తి ఉన్న యువతరం ముందుగా వారి వారి నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అన్ని కార్యాలకు హాజరవుతూ అందరినీ మచ్చిక చేసుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారికి తమవంతుగా సహాయ సహకారాలూ అందిస్తున్నారు. బీద విద్యార్థుల చదువులకు చేయూతను అందిస్తూ యుూత్ కు చేరువ అవుతున్నారు. కరోనా సమయంలో బీదలకు కొంతమంది యువత నేతలు సరుకుల కిట్లతోపాటు, ఆర్థిక సహాయాలు చేశారు. మరోవైపు ఆయా పార్టీల ప్రధాన నేతల ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నియోజకవర్గాల పైనే దృష్టి..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పూర్తిస్థాయిలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాలపై యువతరం దృష్టిసారిస్తోంది. మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు జితేందర్ రెడ్డి పెద్ద కుమారుడు పూర్తిస్థాయిలో రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. జితేందర్ రెడ్డి పోటీచేసిన ఎన్నికలతో పాటు, ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించిన ఎన్నికల్లోనూ అభ్యర్థుల గెలుపు కోసం తన వంతు కృషి చేస్తూ వచ్చాడు. వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్, కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో ఏదేని ఒక స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గద్వాలలో మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చిన్న కుమార్తె స్నిగ్ధ రాజకీయ ప్రవేశం చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో తల్లి తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలలో గుర్తింపు కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉంటే గద్వాల నుంచి గాని, మక్తల్ నుంచి గాని పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం తనయుడు అజయ్ నియోజకవర్గంలో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో పెద్ద ఎత్తున జనానికి నిత్యవసర కిట్లు, వైద్య సేవలు అందజేశారు.. పరిస్థితులను బట్టి ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు నియోజకవర్గం లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్వర్ రెడ్డి రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తండ్రి ఎన్నికల సమయంలో నియోజక వర్గాల ప్రజలతో, ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలతో పరిచయాలు ఉండటంతో పోటీలో ఉండే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా జడ్చర్ల నియోజకవర్గంలో మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి అన్న కుమారుడు మన్నే జీవన్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడం తోపాటు, సేవా కార్యక్రమాలను తమ ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఉన్నత చదువులు చదువుకో లేక పోతున్నా బీదలకు అండగా నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకే ఆయన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అనుచరగణం స్పష్టం చేస్తోంది.
ఇదే నియోజకవర్గంలో ఎంపీటీసీ అయిన అభిమన్యు రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య విభేదాలతో అయోమయం లో ఉన్న పార్టీ శ్రేణులకు నేను ఉన్నాను అంటూ యువనేత రంగినేని అభిలాష రావు రంగ ప్రవేశం చేశారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడిగా, పార్టీ అధిష్టానంతో గుర్తింపు ఉన్న ఎన్నారై అభిలాష్ రావు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తున్నారు. ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో దిగాలని ఆలోచనతో ఆయన ఉన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో మరో యువ నాయకుడు పవన్ కుమార్ యాదవ్ సామాజిక సేవకుడు పేరుతో ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆలయాల నిర్మాణాలు, క్రీడా పోటీలకు, వివాహాలకు సహాయ సహకారాలు అందజేస్తూ వచ్చిన పవన్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు.
టికెట్లు దక్కించుకోవడం కష్టమే..!
యువ నాయకులు రాజకీయాల్లో ప్రవేశించి ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్లు సాధించడం, గెలవడం కత్తి మీద సాము లాంటిదే.. రాజకీయ నేపథ్యం ఉన్న వారి పరిస్థితి అటుంచితే కొత్తగా రాజకీయ ప్రవేశం చేస్తున్నవారు ఆర్థికంగా ఎదిగిన అంత సులువుగా రాజకీయంగా రాణించడం అంత సులువు కాదన్నది గతంలోనే అనేక సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.. జడ్చర్ల, మహబూబ్ నగర్ నుంచి పోటీచేసిన పలువురు యువ నాయకులు సామాజిక కార్యక్రమాలతో గుర్తింపు పొంది పోటీ చేసినా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం రంగ ప్రవేశం చేయాలన్న ఆలోచనతో ఉన్న యువ నాయకులు ఆచితూచి అడుగులు వేస్తూ ప్రధాన పార్టీల టికెట్లు సాధించుకుని, ఉద్దండులైన ప్రత్యర్థులను ఎదుర్కోగలిగితే తప్ప విజయం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.