ఆ యువకులను క్షేమంగా విడుదల చేసిన మావోయిస్టులు

by Sridhar Babu |   ( Updated:2021-07-21 02:11:00.0  )
Maoist Peoples Court
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుకొండ పోలీస్‌స్టేషన్ పరిథిలోని కుందేడు గ్రామం నుంచి మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఏడుగురు యువకులను క్షేమంగా విడిచిపెట్టారు. 18న వీరిని విడిచిపెట్టడంతో 20వ తేదీన రాత్రి ఇళ్ళకు చేరుకున్నట్లు సమాచారం. యువకులకు ఏ హాని తలపెట్టకుండా క్షేమంగా విడిచి పెట్టాలని కుటుంబ సభ్యులు ప్రాథేయపడగా, సర్వ ఆదివాసీ సమాజ్ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో తోలవర్తి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి యువకులు తీరు మార్చుకోవాలని హెచ్చరించి విడుదల చేసినట్లుగా సమాచారం. మావోయిస్టులు కిడ్నాప్ చేసిన యువకులతోపాటు వారిని విడిపించడానికి అడవిబాట పట్టిన గ్రామస్తులంతా ఇళ్ళకు తిరిగి రావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story