ఛలో ఢిల్లీ.. పార్లమెంట్ ముట్టడికి తరలిన కాంగ్రెస్ నాయకులు

by Sridhar Babu |   ( Updated:2021-08-04 03:29:06.0  )
ఛలో ఢిల్లీ.. పార్లమెంట్ ముట్టడికి తరలిన కాంగ్రెస్ నాయకులు
X

దిశ,భువనగిరి రూరల్ : పార్లమెంట్ ముట్టడికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తరలి వెళ్లారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలకు నిరసనగా యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీ.వీ శ్రీనివాస్ పిలుపు మేరకు ఈ నెల 5 వ తేదిన యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా పార్లమెంట్ ముట్టడికి తెలంగాణ నుంచి బుధవారం ఉదయం యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వెలిమినేటి సురేష్ ఢిల్లీ‌కి బయల్దేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు సామాన్యుడి నడ్డి విరిచే‌లా ఉన్నాయని, కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుతూ సామాన్యుడి పై మరింత భారం పెంచుతున్నారని అన్నారు. నరేంద్రమోదీ నిరంకుశ పాలనన, ఆయన అవలంభిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను ఖచ్చితంగా ఎండగడుతామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయని, కేంద్రంలో రాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు.

Advertisement

Next Story