- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి జీవితాలతో చెలగాటం ఆడొద్దు : ఆనంద్
దిశ, మణుగూరు: యువత తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కోర్స ఆనంద్ అన్నారు. ‘నిరుద్యోగ జంగ్ సైరన్’ స్ఫూర్తితో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రషీద్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గం రోజురోజుకూ ఇండస్ట్రీయల్ ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్‌సీసీఎల్, బీటీపీఎస్, ఐటీసీ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో స్థానికులకు 60 శాతం వాటా ఉందని తెలిపారు.
కానీ, ఈ ఉద్యోగాలు స్థానిక యువతకు ఇవ్వకుండా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఇవ్వడంతో స్థానిక యువత మానసికంగా కుంగిపోయి చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవ చూపి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. లేకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మైనార్టీ నాయకులు ఎండీ షరీఫ్, మండల బీసీ సెల్ నాయకులు సాంబశివరావు, పట్టణ ఉపాధ్యక్షులు ఎండీ నూరోద్దీన్, నాయకులు ముక్కెర మధు, సంతోష్, పల్లపు సంపత్, ఎస్కే రఫీ, పగిడిపల్లి శ్యామ్, ఎండీ ఖాన్, చిన్నాల నాగరాజు, కాకర్ల వెంకటేష్, సతీష్, దేవా, సన్నీ తదితరులు పాల్గొన్నారు.