- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలువలోకి దూకిన యువకుడు.. కంటతడి పెట్టిన తండ్రి
దిశ, ఇల్లందు : అందరూ చూస్తుండగానే పట్టణ నడిబొడ్డులో ఉన్న బుగ్గవాగులో లెవెల్ చప్టా పై నుంచి దూకి మతిస్థిమితం లేని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన ఇల్లందు పట్టణంలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఇల్లందు మండలం, సుదిమల్ల గ్రామపంచాయతీ, కొత్తూరు గ్రామానికి చెందిన చీమల భాను ప్రకాష్ (25) అనే యువకుడు స్థానికంగా ఒక వాటర్ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. వాటర్ క్యాన్‌లను వ్యాన్‌లో నింపుకుని బుగ్గ వాగు వద్ద ఆగాడు. వెంటనే అక్కడి నుండి బుగ్గవాగులో లెవెల్ చప్టా వరకు నడుచుకుంటూ వెళ్లి మురికి నీళ్లలో దూకాడు.
ఈ దృశ్యాన్ని కొందరు చూస్తూనే ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే పోలీసు, ఫైర్ సిబ్బందికి తెలియజేయగా వచ్చి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి ఆ యువకున్ని బయటకు తీయగలిగారు. అతని రక్షించేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. అయినా, అతని శరీరంలో ఎలాంటి చలనం లేకపోవడంతో రోడ్డు మీదకు తీసుకువచ్చి పోలీసులు పంచనామా చేశారు. శవం కోసం నీళ్లలో దిగిన ముగ్గురిలో ఆ యువకుని తండ్రి వెంకటేశ్వర్లు కూడా ఉండటం, శవం ఆ తండ్రికే దొరకడంతో కన్నీరుమున్నీరయ్యాడు. విషయం తెలియగానే మున్సిపల్ చైర్మన్ దమ్మాలపా టి వెంకటేశ్వరరావు, ఆ వార్డు కౌన్సిలర్ పోబోలు స్వాతి కిరణ్, ఇల్లందు ఎస్ఐ శ్రీనివాసరావు యువకుడి శవాన్ని బయటకు తీయడానికి సహాయ చర్యలు చేపట్టారు.