నాటు తుపాకీతో అన్నను కాల్చిన తమ్ముడు

by Anukaran |
నాటు తుపాకీతో అన్నను కాల్చిన తమ్ముడు
X

దిశ, వెబ్ డెస్క్: దినదినం మనిషన్నవాడు అభివృద్ధి చెందుతున్నాడు. ఆధునిక ప్రపంచంతో పోటీ పడుతూ తన తెలివితేటలను ప్రదర్శిస్తూ అభివృద్ధి చెందుతున్నాడు. కానీ, రోజురోజుకు రక్తసంబంధాల మధ్య ప్రేమ సంబంధాలు దూరమవుతున్నాయి. చిన్న చిన్న గొడవలకు ఒకరికొకరు దూరమవుతున్నారు. వారి మధ్య ప్రేమానురాగాలు కనుమరుగవుతున్నాయి. ఇంకొందరైతే ఏకంగా ఒకరి ప్రాణాలు మరొకరు తీస్తుకుంటున్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.

విశాఖపట్నంలో పెదబయలు మండలం కుంతుర్ల గ్రామంలో గుంట రాంబాబు అనే వ్యక్తిని తన తమ్ముడు గుంట కృష్ణారావే నాటు తుపాకీతో కాల్చాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story