పెద్దపులి దాడిలో యువతి మృతి

by Shyam |
పెద్దపులి దాడిలో యువతి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి బీభ‌త్సం సృష్టించింది. పెంచికలపేట మండలం కొండపల్లిలో పత్తిచేనులో పనిచేస్తుండగా నిర్మల అనే యువతిపై పులిదాడి చేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈనెల 11న దహేగాం మండలం దిగిడలో ఇటీవల పెద్దపులి దాడిలో యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. మళ్లీ పులి సంచారం విషయం తెలియడంతో కొండపల్లి గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed