దగ్గు తెచ్చిన తంటా.. శానిటైజర్ తాగిన యువతి

by srinivas |
దగ్గు తెచ్చిన తంటా.. శానిటైజర్ తాగిన యువతి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ప్రజల జీవన విధానంలో పెను మార్పులను తీసుకువచ్చింది. గతానికి భిన్నంగా ప్రజల జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. కరోనా వచ్చిందనే భ్రమలో పడిపోతున్నారు. ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని విస్సన్నపేట మండలం ముతరాశిపాలెంకు చెందిన నాగబోయిన శిరీష(20)కు దగ్గు వచ్చింది. టైలరింగ్ చేసే ఆమెకు ఆగకుండా దగ్గు రావడంతో కరోనా సోకిందనే అనుమానంతో మంగళవారం సాయంత్రం శానిటైజర్ తాగింది. అయినా దగ్గు తగ్గకపోగా తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed