- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కామాందుల పై యువతి ఎదురుదాడి
దిశ, వెబ్‌డెస్క్: ఆస్పత్రి వెయిటింగ్ హాల్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న యువతి పై కామాందులు కన్నేశారు. ఎలాగైన తమ కోరిక తీర్చుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో అదును చూసి ఒక్కసారిగా ఆమె పై ఎగబడ్డారు. కానీ, కథ అడ్డం తిరిగింది. అప్రమత్తమైన యువతి ఎదురుదాడి చేసి నిందితుల ఆట కట్టించింది.
బీహార్‌లోని పాట్నాలో ఈ ఘటన వెలుగుచూసింది. నగరంలోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో స్థానిక మహిళ చికిత్స పొందుతుంది. అయితే, పేషెంట్‌కు సేవలు అందించేందుకు లేడి అటెండర్ అవసరం. దీంతో ఆ పేషెంట్‌కు కూతురు సేవలు చేస్తూ అక్కడే నిద్రిస్తుంది. అయితే, పేషెంట్ పక్కనే స్థలం లేకపోవడంతో ఆస్పత్రి లాంజ్‌లో శనివారం రాత్రి తలవాల్చి నిద్రలోకి జారుకుంది. అదే రోజు రాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు సిబ్బంది అమ్మాయి పై అత్యాచారం చేసేందుకు ప్లాన్ వేశారు.
కొద్ది సేపటి వరకు ఆస్పత్రిలో తిరిగి.. ఎవరూ లేని సమయం కోసం ఎదురుచూశారు. సరిగ్గా అర్ధరాత్రి తర్వాత అందరూ నిద్రలోకి జారుకున్నారని గ్రహించారు. మెల్లగా ఆ యువతి వద్దకు వచ్చారు.. ఆ తర్వాత ఒకరు అమ్మాయి కప్పుకున్న దుప్పటి లాగడంతోనే.. మరొక వ్యక్తి గట్టిగా నోరు నొక్కెశాడు. ఇదే సమయంలో దుప్పటి లాగిన వ్యక్తి బాధితురాలి కాళ్లను గట్టిగా అదిమి పట్టి కట్టేసే ప్రయత్నం చేశాడు.
ఆకస్మాతుగా తన పై అత్యాచారం చేసేందుకు వచ్చిన ఆగంతకులను చూసి యువతి షాక్ అయింది. కాళ్లు-చేతులు కట్టేస్తున్న సమయంలో పక్కనే ఉన్న స్టీల్ జగ్గును ఆయుధంగా చేసుకున్న యువతి నోరు నొక్కేస్తున్న వ్యక్తి తలపై బలంగా కొట్టింది. దీంతో అతడు నొప్పి బాధతో తలపట్టుకున్నాడు. ఇదే సమయం అదునుగా చేసుకున్న యువతి గట్టిగా కేకలు వేస్తూ మరో వ్యక్తి పై దాడికి దిగింది.
అంతే.. కొద్ది క్షణాల్లోనే ఆస్పత్రిలోని పేషంట్లు, బంధువులు కామాందుల పై పిడిగుద్దులు కురిపించారు. నిందితులు ఆస్పత్రిలోనే పనిచేస్తున్నారని తేలడంతో మరో రెండు దెబ్బలు ఎక్కువే కొట్టి.. పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.