యువతిని దారుణంగా మోసం చేసిన స్టార్ హీరో.. పెళ్లి చేసుకుంటానని చెప్పి

by Anukaran |   ( Updated:2021-08-12 00:30:18.0  )
hero arya cheating case
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ హీరో ఆర్య మరో వివాదంలో చిక్కుకున్నాడు. హీరో ఆర్య తనను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనం రేపుతోంది. జర్మనీలో ఉంటున్న శ్రీలంకకు చెందిన విద్జా అనే యువతి, ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70లక్షలు తీసుకుని మోసగించినట్లు జర్మని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే భారత రాష్ట్రపతి, ప్రధానులకూ ఆమె లేఖ రాశారు. అంతేకాకుండా ఆర్యతో చేసిన చాటింగ్‌ స్క్రీన్‌షాట్‌ ఫొటోలు కూడా విడుదల చేసింది.

గత కొన్ని రోజుల క్రితం నమోదు అయిన ఈ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసు విషయమై నటుడు ఆర్యకు చెన్నైలోని సైబర్‌క్రైం పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆర్య సైబర్‌క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఆర్యను సైబర్‌క్రైం ఇన్‌స్పెక్టర్‌ గీత మూడుగంటల పాటు విచారించారు. ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్న ఈ కేసు ఈనెల 17న మళ్లీ విచారణకు రానుంది. ఇకపొతే ఆర్య తమిళ్తో పాటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. రాజా రాణి, వరుడు, ఇటీవల సార్పట్ట చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019 లో యంగ్ హీరోయిన్ సాయేషా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్య హీరో విశాల్ తో కలిసి ‘ఎనిమీ’ చిత్రంలో నటిస్తున్నాడు.

Advertisement

Next Story