ఎన్నో కలలుకని.. పెద్దలు దానికి ఒప్పుకోక పోవడంతో యువతి ఏం చేసిందంటే ?

by Sumithra |   ( Updated:2021-10-20 22:23:14.0  )
ఎన్నో కలలుకని.. పెద్దలు దానికి ఒప్పుకోక పోవడంతో యువతి ఏం చేసిందంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అనగానే అమ్మాయి కానీ, అబ్బాయి కానీ ఎన్నో కలలు కంటారు. ఓ కొత్త జీవితాన్ని ప్రారంభిచబోతున్నామని, ఓ ప్రణాళిక రూపొందించుకుంటారు. ఇక పెళ్లి ఫిక్స్ అయినాక అమ్మాయి ఆ అబ్బాయితోనే జీవితం అని ఫిక్స్ అయిపోతుంది. తన మీద ఎనలేని ప్రేమను పెంచుకుంటుంది. అలా పెళ్లి ఫిక్స్ అయి, అతనే తన భర్త అని ఊహించుకున్నాక అకస్మాత్తుగా పెళ్లి లేదా ఎంగేజ్ మెంట్ ఆగిపోతే ఎలా ఉంటుంది. మోయలేని భారంగా అనిపిస్తుంది కదా.. ఇలానే ఎన్నో కలలు కని తానే భర్త అనుకునేలోపే ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయ్యిందని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. మహేశ్వరం మండలానికి చెందిన చామలేటి చంద్రయ్య, లావణ్య దంపతుల కుమార్తె ప్రగతి (19) డిగ్రీ చదివి ఇంటివద్దే ఉంటోంది. కాగా, యువతికి మండలం పరిధిలోని అమీర్ పేట గ్రామానికి చెందిన కార్తీక్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. తర్వాత అమ్మాయి అబ్బాయితో ఫ్రీగా మాట్లాడటం చేయసాగింది. వారికి తెలియ కుండానే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ వారి మధ్య ఏర్పడింది. ఇక వీరిద్దరికీ గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది కానీ ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగి పట్టింపులకు పోవడంతో నిశ్చితార్థం రద్దయింది. అయితే ప్రగతి అప్పటికే కార్తీక్ అంటే ఇష్టం పెంచుకుంది. ఇద్దరికీ ఇష్టం ఉన్నా పెద్దలు నో చెప్పడంతో యువతి మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని యువతి కాల్ డేటాను పరిశీలించి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Next Story