యువతి బంఫర్ ఆఫర్.. రూ.11,999లకే నగ్నంగా మాట్లాడొచ్చు!

by Anukaran |
Nude Videos
X

దిశ, కుత్బుల్లాపూర్ : సైబర్ నేరాలపై పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. అమ్మాయిలు హాట్‌గా మాట్లాడితే చాలు.. వాళ్లకు లొంగిపోయి చెప్పిందల్లా చేసి నష్టాల పాలవుతున్నారు. అపరిచిత యువతితో వీడియో కాల్ మాట్లాడి కుత్బుల్లాపూర్ కు చెందిన యువకుడు నిండా మోసపోయాడు. అటు డబ్బులు పోయి.. ఇటు నగ్న వీడియోలు ప్రచారం కావడంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.

కుత్బుల్లాపూర్‌కు చెందిన యువకుడు ఈనెల 7వ తేదీన తన మొబైల్ ఫోన్‌లో ఫేస్ బుక్ ఓపెన్ చేశాడు. అదే సమయంలో ప్రియా అనే ఓ యువతి రిక్వెస్ట్ పెట్టింది. ఈనెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు అతను రిక్వెస్ట్ కు ఓకే చేశాడు. కొద్దిసేపు చాటింగ్ చేసిన తరువాత ఆ యువతి వీడియో కాల్ చేద్దామని కోరడంతో యువకుడు ఓకే అన్నాడు. ఇద్దరు కలిసి వీడియో కాల్ మాట్లాడుతూ స్నేహితులుగా మారిపోయారు. ఫోన్ కట్ చేసిన యువతి… కొద్దిసేపటి తరువాత మళ్లీ వీడియో కాల్‌లో మాట్లాడింది. అది కూడా హాట్ హాట్‌గా మాట్లాడడంతో ఆ యువకుడు ఆమె మైకంలో పడిపోయాడు. నువ్వు ఎలాంటి దుస్తులు లేకుండా వీడియో కాల్ మాట్లాడు అని కోరడంతో యువకుడు అలాగే చేశాడు.

వీడియో కాల్ కట్ అయిన కొద్దిసేపటి తర్వాత ఆ యువతి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నువ్వు మాట్లాడిన వీడియో కాల్ రికార్డింగ్ చేశానని, నాకు రూ.11,999 లు పంపాలని బంఫర్ ఆఫర్ ఇచ్చింది. లేదంటే నీ వీడియోను ఫేస్ బుక్ లో ఉన్న స్నేహితులందరికీ పంపిస్తానని బెదిరించింది. అంత డబ్బులు నా దగ్గర లేవని యువకుడు చెప్పడంతో ఆ వీడియోను ఫేస్ బుక్ చేసింది. వీడియోలను చూసిన నా స్నేహితులు ఏమైందని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తెలిపాడు. తదనంతరం ఆ యువకుడు పేటీఎమ్ ద్వారా రూ.1000 లు పంపించాడు. అయినప్పటికీ వీడియోను ఫేస్ బుక్ లో డిలేట్ చేయకపోవడంతో దుండిగల్ పోలీసులను ఆశ్రయించాడు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణా రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story