- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. యువకుల సూటి ప్రశ్న
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రెండేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి తమ గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేంధర్ను గండిమాసానిపేట్‌కు చెందిన యువకులు నీలదిశారు. గ్రామస్తులు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో పాదయాత్రకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్న వాహిద్, తలారి సతీష్‌లు.. ముందుగా గ్రామానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 500 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు అయినా వాటిని నిర్మించలేదన్నారు. కరోనా సాకుతో అభివృద్ధి పనులు చేయడం లేదని చెప్పడం ఏంటన్నారు. గ్రామంలో మిషన్ భగీరథ నీల్లు ఇస్తామని చెప్పి.. నళ్లాలు బిగించారని.. కానీ, నీరు రాని నళ్లాలతో ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శించారు. అటు సీసీ రోడ్ల పనులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని.. కనీసం ఇప్పటికైనా ప్రజా ప్రతనిధులు చొరవతీసుకొని పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల మధ్య స్పల్ప ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకోవడంతో స్థానిక లీడర్లు జోక్యం చేసుకొని యువకులకు నచ్చజెప్పారు.