ఆస్తి తగాదా.. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తిపై దాడి.. యువకుడు మృతి

by Sridhar Babu |   ( Updated:2021-10-19 11:11:56.0  )
ఆస్తి తగాదా.. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తిపై దాడి.. యువకుడు మృతి
X

దిశ, వేములవాడ : సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ తగాదాలతో పిట్టల మహేష్(25) అనే యువకుడిని అదే కుటుంబానికి చెందిన పిట్టల లక్ష్మీనరసయ్య, పిట్టల పరుశురాం హత్య చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాతల కాలం నుంచి వస్తున్న భూమిని కుటుంబంలోని వారందరికీ సమాన వాటాలుగా పంపకాలు చేయకుండా పిట్టల మహేష్, రాజేశం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఈ విషయంపై కుటుంబంలో పలుమార్లు పంచాయితీలు నిర్వహించుకున్నారు. ఇదే విషయమై మంగళవారం పాత కక్షలతో మహేష్‌, రాజేశంపై పిట్టల లక్ష్మీనరసయ్య, పిట్టల పరుశురాం దాడి చేశారు. ఈ క్రమంలో మహేష్ మృతి చెందగా రాజేశంకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వేములవాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న పిట్టల లక్ష్మీనరసయ్య, పిట్టల పరుశురాం కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed