- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదుగురు అబ్బాయిలపై యువకుడు అత్యాచారం.. ఒక్కొక్కరిని తీసుకెళ్లి..
దిశ, వెబ్‌డెస్క్ : సమాజంలో రోజురోజు కామాంధులు సంఖ్య పెరుగుతోంది. ముక్కుపచ్చలారని పసి పాపల నుంచి పండు ముదుసలి వరకు ఆడ వాసన తగిలితే చాలు.. అత్యాచారాలకు తెగబడుతున్నారు. మరికొందరు కామ రాక్షసులు మూగజీవాలపై కూడా తన కోరికలను తీర్చుకుంటున్నారు. ఇంకొందరు అబ్బాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో ఐదుగురు అబ్బాయిలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
గంగాపూర్ గ్రామానికి చెందిన మురారి లాల్ (38)కు అదే ప్రాంతానికి చెందిన ఓ కుటుంబంతో రెండు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. వారికి 8 నుంచి 14 ఏళ్ల వయసున్న ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు. 6వ నుంచి 9వ తరగతి వరకు చదవే వారిని కామాక్ష ప్రాంతంలోని ప్రముఖ పాఠశాలలో చేర్పిస్తానని మురారి లాల్ తల్లిదండ్రులకు చెప్పాడు. వారిని స్కూల్‌లో చేర్పించిన మురారి లాల్.. మైనర్ బాలురను బీహెచ్‌యూ హెలీప్యాడ్ పొదల్లోకి తీసుకెళ్లి ఒక్కొక్కరిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు.
ఇలా కొద్ది రోజులుగా మురారి లాల్ మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడుతుండడంతో వారు ఆ నొప్పి భరించలేక ఈనెల 21 జరిగిన ఘోరాన్ని మైనర్ బాలుర్లు వారి బంధువుకు తెలిపారు. వెంటనే ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 377, పోక్సో చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఎ.సతీష్ కుమార్ తెలిపారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.