సీఎం కేసీఆర్‌ని గాంధీలో చేర్చాలంటూ యువకుడి నిరసన

by Sridhar Babu |   ( Updated:2021-04-24 03:18:10.0  )
సీఎం కేసీఆర్‌ని గాంధీలో చేర్చాలంటూ యువకుడి నిరసన
X

దిశ ,కరీంనగర్ సిటీ : కొవిడ్ రోగులకు చికిత్స అందించే హైద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఎదుట కరీంనగర్ కు చెందిన యువకుడు వినూత్న నిరసన చేపట్టాడు. పేద, మధ్య తరగతి రోగుల కోసం కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని, లేకుంటే సీఎం కెసీఆర్, మంత్రి కేటీఆర్లను గాంధీ ఆస్పత్రిలో చేర్చాలంటూ ప్లకార్డు ధరించి డిమాండ్ చేశారు. కరోనా విళయతాండవం చేస్తున్న మన రాష్ట్రంలో ఇదే అదునుగా భావిస్తూ ఎన్నో ప్రయివేటు ఆసుపత్రులు కరోనా వైద్య చికిత్సల పేర పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకుంటూ, మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సదుపాయాలు లేని గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్లలేక ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయివేటు హాస్పిటల్ లో చెర్పించి అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తెలిసి కూడా ప్రజలే మా దేవుళ్ళు ,ప్రజలకోసమే మేము అంటు ఎన్నో గొప్పలు చెప్పే రాజకీయ నాయకులు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నారంటూ గాంధీ హాస్పిటల్ ముందు కరీంనగర్ కి చెందిన సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed