చెరువులో పడి యువకుడు మృతి

by Shyam |
చెరువులో పడి యువకుడు మృతి
X

దిశ, పటాన్ చెరు: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చింతల చెరువు హత్నూర మండలానికి చెందిన వెంకటేశ్ (25) బతుకుదెరువు కోసం పదకొండ ఏండ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి వచ్చి మండలంలోని ఇంద్రేశం ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కూలి పని చేసుకుంటూ అతను జీవనం సాగిస్తున్నాడు. కాగా ఈ నెల 24 ఉదయం ఇంటి నుంచి వెళ్లిన వెంకటేశ్ తిరిగి ఇంటికి రాలేదు. అదే గ్రామానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి కాలకృత్యాల కోసం గద్దె కుంట చెరువు దగ్గరికి సోమవారం ఉదయం వెళ్లాడు. అక్కడ నీటిపై మృతదేహం తేలి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించాడు. చెరువు దగ్గరకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నీటిలోనుంచి వెలికితీశారు. మృతున్ని గుర్తించి అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బట్టలు, చెప్పులు ఒడ్డుపైనే ఉన్నాయనీ, స్నానం కోసం చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఎస్ఐ రామానాయుడు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed