- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విషాదం: ఆ ఆట ఆడుతుండగా ఒక్కసారిగా ఆగిన గుండె.. యువకుడు మృతి
దిశ,మక్తల్: అతడికి క్రికెట్ అంటే ప్రాణం.. వృత్తిపరంగా అతను డ్రైవరే అయినా.. ఎప్పుడూ అతడి చూపు గ్రౌండ్ మీదే ఉండేది. ఖాళీ సమయం దొరికితే చాలు దోస్తులతో గ్రౌండ్ లో క్రికెట్ ఆడడానికి వెళ్లిపోయేవాడు. ఎప్పటిలానే బుధవారం కూడా మిత్రులతో కలిసి క్రికెట్ ఆడడానికి వెళ్లిన అతడికి మృత్యువు హార్ట్ ఎటాక్ రూపంలో కబళించింది. అతనికి ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆడుతున్నప్పుడే గుండె ఆగి కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన మక్తల్ పట్టణంలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. మక్తల్ పట్టణంలో నివసించే మహమ్మద్(25) ఆటో నడుపుతుండేవాడు. చిన్నప్పటి నుంచి మహమ్మద్ కు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పుడు సమయం దొరికినా గ్రౌండ్ కి వెళ్లి మిత్రులతో క్రికెట్ ఆడేవాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం డ్రైవింగ్ కు విరామం దొరకడంతో స్నేహితులతో కలిసి మక్తల్ పట్టణంలోని మినీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడడం మొదలుపెట్టారు. మహమ్మద్ బ్యాటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెల్లో నొప్పి మొదలయ్యింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మహమ్మద్ ని వెంటనే స్నేహితులు ఆసుపత్రికి తరలించగా హార్ట్ ఎటాక్ రావడంతో అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ అనుకోని ఘటనతో మక్తల్ పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి.