- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరిసిల్లలో బ్లాక్ ఫంగస్ కలకలం.. యువకుడు మృతి
దిశ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. అసలే కరోనాతో జనం భయాందోళనకు గురవుతుండగా, మరో పక్క బ్లాక్ ఫంగస్ మరింత భయపెడుతుంది. వేములవాడ టౌన్‌లోని జాతర గ్రౌండ్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు సోమవారం బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందాడు. అలాగే వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన 52 ఏళ్ల మహిళలో కూడా బ్లాక్ ఫంగస్ లక్షణాలు గుర్తించిన వైద్యులు హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో, పలు ఆస్పత్రుల్లో తిరిగినా మహిళలను ఏ ఆస్పత్రిలోనూ చేర్పించుకోలేదు.
సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం మహిళను అడ్మిట్ చేసి, వైద్యం చేయిస్తున్నారు. అదేవిధంగా మూడు రోజుల క్రితం చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ రావడంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తు్న్నారు. జిల్లాలో బ్లాక్ ఫంగస్‌తో ఒకరు మృతి చెందగా, ఇద్దరు లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండటంతో ప్రజలు భయానికి గురి అవుతున్నారు.