- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఠాగూర్ సీన్ రిపీట్.. ఆపరేషన్ కోసం వెళ్తే ఊపిరి తీశారు..
దిశ, జగిత్యాల : నాలుగు నెలల క్రితమే వివాహం చేసుకొని హాయిగా జీవితం గడుపుతున్న యువకుడు, చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వెళ్తే కానరాని లోకాలకు వెళ్లిపోయాడాని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ శివవీధికి చెందిన సతీష్ అనే యువకుడు కొన్ని రోజుల క్రితం ఆపరేషన్ కోసం గొల్లపల్లి రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో వైద్యుడు ఆపరేషన్ నిర్వహించగా, ఆ ఆపరేషన్ వికటించి యువకుడు మృతి చెందాడు. దీంతో వైద్యుడి నిర్లక్ష్యం వల్లే సతీష్ మృతి చెందాడని అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సతీష్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఈ నెల 3వ తేదీన సతీష్ హెర్ని ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. కాగా, ఆపరేషన్ సమయంలో బీపీ చెక్ చేయకుండానే.. ఆపరేషన్ నిర్వహించారని, ఈ క్రమంలో సతీష్ బ్రెయిన్ డెడ్ కాగా అప్పటికప్పుడే మృతి చెందాడని తెలిపారు. అయితే డాక్టర్ చాకచక్యంగా ఠాగూర్ మూవీ సీన్‌ను క్రియేట్ చేసి, మెరుగైన వైద్యం కోసం సీనియర్ డాక్టర్స్‌ను పిలిపించినట్లు డ్రామా ఆడారని తెలిపారు. వెంటిలేటర్ సహాయంతో మెరుగైన వైద్యం కోసం.. శ్రద్ధ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారని అన్నారు.
కాగా, శ్రద్ధ ఆసుపత్రిలో వెంటిలేటర్ సహాయంతో మరో 3 రోజులు డ్రామా క్రియేట్ చేసి ఈ నెల 6వ తేదీ సాయంత్రం సీరియస్‌గా ఉందని.. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారని అప్పటికే సతీష్ మృతి చెందాడని తెలిపారు. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు.