కామరెడ్డి రైల్వేస్టేషన్‌లో దారుణం.. యువకుడు మృతి

by Sumithra |
కామరెడ్డి రైల్వేస్టేషన్‌లో దారుణం.. యువకుడు మృతి
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్ఐ తావునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి రైల్వేస్టేషన్ కు సమీపంలో అడ్లూరు శివారులో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు మృతుని వద్ద దొరికే ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ ఆధారంగా తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామానికి చెందిన గుంరెడ్డి శ్రీకాంత్(32) గా గుర్తించారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగిందని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా ఎస్ఐతావునాయక్ తెలిపారు.

Advertisement

Next Story