బండి ఫైనాన్స్ కట్టలేక యువకుడి ఆత్మహత్య

by Sumithra |
Young man
X

దిశ, హుస్నాబాద్: వాహన కిస్తీలు కట్టలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చాపగాని తండాలో ఆదివారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గుగులోతు శ్రీకాంత్(28) బీటెక్ పూర్తి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు.గతేడాది శ్రీకాంత్ ఫైనాన్స్ లో టాటాఏసీ వాహనాన్ని కొనుగోలు చేసి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కిరాయిలు దొరకకపోవడంతో ఫైనాన్స్ కిస్తీలు ఎలాకట్టాలో నిత్యం మనో వేదనకు గురయ్యే వాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని తల్లిదండ్రులు తెలిపారు. తండ్రి మంజ్యనాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొత్తపల్లి రవి తెలిపారు.

Advertisement

Next Story