- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమ పేరుతో యువతి వేధింపులు.. జైలు నుంచి వచ్చిన యువకుడు ఏం చేశాడంటే..
దిశ, ములుగు : ‘ ప్రేమ’ రెండే అక్షరాలు.. రెండు నిండు జీవితాలు ముడిపడే ఓ మధురమైన బంధం. ఇప్పుడు అదే ప్రేమ కొందరిలో వెలుగు నింపుతూ ఉంటే మరి కొన్ని జీవితాలను,ఇరు కుటుంబాలను చీకటిమయం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రేమికుల మరణాలు ఎక్కువ అవుతున్నాయి. కొందరు ప్రేమికులు వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోరని అర్ధాంతరంగా తనువు చాలిస్తుంటే.. మరికొందరు వేధింపులు తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇందుకు నిదర్శనమే ములుగు జిల్లా కేంద్రంలో విషాదం గా ముగిసిన ఓ ప్రేమ కథ.
వివరాల్లోకి వెళ్తే….
ములుగు జిల్లాకు చెందిన బరుపాటి సాయి సూర్య (28) బండారుపల్లి గ్రామానికి చెందిన ఓ అమ్మాయి 27 ప్రేమించుకున్నారు. ఏమైందో కానీ వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సాయి సూర్య అమ్మాయిని దూరం పెట్టాడు. దీనితో తనకు అన్యాయం చేశాడని, పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడని ఆరోపిస్తూ తనను పెళ్లి చేసుకోవాలని సాయి సూర్య ఇంటి ముందు సదరు యువతి సుమారు మూడు నెలల పాటు టెంట్ వేసుకుని మౌన దీక్ష చేపట్టింది. యువతికి న్యాయం చేయాలని పలు ప్రజా సంఘాలు ఆ దీక్షకు మద్దతు ప్రకటించారు. మూడు నెలలు గడిచినప్పటికి ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో న్యాయం చేయాలని సాయి సూర్యతో పాటు వారి కుటుంబ సభ్యులపై యువతి ఫిర్యాదు చేసింది. దీంతో కుటుంబ సభ్యుల పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే శిక్ష అనుభవించిన వారు బయటకు వచ్చారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన సాయి సూర్యకు అమ్మాయి నుండి వేధింపులు వస్తున్నాయని వారి వేధింపులు తాళలేక తనువు చాలిస్తున్నానని సూసైడ్ నోట్ రాసి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారి ప్రేమ విషాదంగా ముగిసింది.
మృతుడు తల్లి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి..
తమ కుమారుడు బరుపాటి సాయి సూర్య ను బండారుపల్లి గ్రామానికి చెందిన గూడెపు మౌనిక కొద్దిరోజులుగా ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని నా కొడుకు వెంటపడుతూ ఇంటి ముందు కొద్దిరోజులుగా టెంట్ వేసుకుని కూర్చుందన్నారు. పెళ్లి చేసుకుంటావా లేదా పదిహేను లక్షల రూపాయలు అన్న ఇస్తావా అంటూ మౌనిక, వారి కుటుంబ సభ్యులు, కొంతమంది పెద్దలు నా కొడుకుని బెదిరించేవారని మృతుడి తల్లి రమాదేవి తెలిపింది. ఈ విషయమై మాపై రెండు కేసులు కూడా పెట్టినది. ఈ కేసులలో మేము జైలుకు కూడా వెళ్ళి వచ్చాము. అయినా కూడా ఆగకుండా రెండు మూడు రోజులుగా మౌనిక , తన కుటుంబ సభ్యులు, కొంతమంది పెద్ద మనుషులు నా కొడుకును మౌనికను పెళ్లి చేసుకోవాలని లేదా 15 లక్షల రూపాలు ఇస్తావా లేకుంటే మళ్లీ కేసు పెట్టనా అంటూ వేధించగా బాధ భరించలేక, అవమానాన్ని ఎవరికీ చెప్పలేక తనలో తాను బాధపడుతూ ఉండేవాడన్నారు. కాగా వారి వేధింపులు భరించలేకనే శుక్రవారం ములుగు లో గల మా పాత ఇంటికి వెళ్లి ఇంట్లో ఎవరులేనిది చూసి చీరతో ఉరి వేసుకుని ఉన్నాడనీ రోదిస్తూ తెలిపింది. వెంటనే దవాఖానకు తీసుకురగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. నా కొడుకు సాయి సూర్య మౌనిక, మౌనిక కుటుంబ సభ్యులు ఇంకా కొంతమంది పెద్ద మనుషుల వేధింపుల వల్లనే ఉరివేసుకుని చనిపోయాడని దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ పాపం ఎవరిది..?
సాయి సూర్య వర్మ బలవర్మణంతో మాత్రం ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది. ఈ పాపం ఎవరిది..? ప్రేమించినందుకు మౌనికదా? పెళ్లి చేసుకొనందుకు సాయి సూర్య వర్మదా ?.. ఒత్తిడి చేసిన నా కుల ప్రజా సంఘాలదా?. ఒకవేళ పెళ్లి చేసుకొని ఉంటే బతికి ఉండేవాడా.. అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఈ ప్రేమకథ ములుగు జిల్లాలో సంచలనం రేకెత్తించింది.
- Tags
- love