- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళతో అక్రమ సంబంధం.. యువకుడు దారుణ హత్య
దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం నిమ్మ గూడెం గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు వివరాలు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా మృతుని ఫోన్ నెంబర్ కాల్ డేటాను పరిశీలించగా అదే గ్రామానికి చెందిన తడండ్ల మాంతయ్య అనే వ్యక్తి.. తన సెల్ ఫోన్ ద్వారా హత్యకు ముందు రోజు రాత్రి మృతునితో పలుమార్లు మాట్లాడినట్టు తెలిసింది. కాల్ డేటా ఆధారంగా మాంతయ్య గురించి పోలీసులు వెతకగా అతని ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తూ హత్యకు పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో.. సోమవారం యమన్ పల్లి సెంటర్ వద్ద కాటారం సీఐ హతి రామ్, మహాముత్తారం ఎస్ఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. అయితే, తనిఖీల్లో భాగంగా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, జాడీ ప్రవీణ్‌ను చంపిన నిందితులు తామేనని నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తడండ్ల మాంతయ్య భార్య సంధ్యతో జాడీ ప్రవీణ్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
ఈ నేపథ్యంలో ప్రవీణ్‌ను చంపితే ఎలాంటి గొడవలు ఉండవని అతన్ని చంపడానికి.. తడండ్ల మాంతయ్య అతని భార్యను ఒప్పించి, పథకం ప్రకారం శుక్రవారం రాత్రి తన భార్య సంధ్యతో ప్రవీణ్‌కు ఫోన్ చేయించారు. ఈ క్రమంలో వారి ఇంటి సమీపంలో గల టేకు చెట్ల మధ్య భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రవీణ్‌ను నరికి చంపారని నిందితులు వెల్లడించారు. ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని చీరలో కట్టి పెద్ద కర్రల సహాయంతో మోసుకుంటూ వెళ్లి వాడకట్టు సమీపంలో గల ఖాళీ ప్రదేశంలో వదిలేసి మృతుని సెల్‌ఫోన్ తీసుకొని వారిద్దరూ పారిపోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ కేసును 48 గంటల్లో ఛేదించిన కాటారం సీఐ హతి రామ్, మహా ముత్తారం ఎస్ఐ శ్రీనివాస్‌ను కాటారం డీఎస్పీ బోనాల కిషన్ అభినందించారు.