ఆమె వద్దన్నా అతడు వదల్లేదు.. చివరికి

by Shyam |   ( Updated:2020-07-03 10:05:29.0  )
ఆమె వద్దన్నా అతడు వదల్లేదు.. చివరికి
X

దిశ వెబ్‌డెస్క్: ఆమె‌కు వివాహం అయింది. అయినా ఓ అకతాయి ఆమె వెంట పడుతూ వేధిస్తున్నాడు. పలుసార్లు హెచ్చరించినా బుద్ధి మార్చుకోలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించడంతో ఆకతాయి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన ఓ వివాహితను పవన్ కుమార్(30) అనే యువకుడు రోజూ వెంటపడుతూ.. వేధిస్తున్నాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed