‘ఇన్ఫెక్షన్ ఫ్రీ ట్యాప్’ను రూపొందించిన యువకుడు

by vinod kumar |
‘ఇన్ఫెక్షన్ ఫ్రీ ట్యాప్’ను రూపొందించిన యువకుడు
X

దిశ వెబ్ డెస్క్: కరోనాను నియంత్రించాలంటే.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు. అయితే చేతులు కడుక్కునేటప్పుడు మనం ట్యాప్ ను ఆన్ చేయక తప్పదు. ఒకవేళ ఆ ట్యాప్ పై వైరస్ ఉంటే.. చేతులు కడుక్కున్నా ప్రయోజనం ఉండదు. అందువల్ల చేతులతో ముట్టుకోకుండా.. కాళ్లతో ప్రెస్ చేస్తే వాటర్ వచ్చేలా లేహ్ కు చెందిన ఓ యువకుడు ‘ఇన్ఫెక్షన్ ఫ్రీ ట్యాప్’ను రూపొందించారు. అంతేకాదు దీనివల్ల 80 శాతం వాటర్ కూడా సేవ్ అవుతాయి.

కోవిడ్ 19 వైరస్ కారణంగా ఏదీ ముట్టుకున్నా.. చేతులను శుభ్రంగా కడుక్కోవడం అందరూ అలవాటు చేసుకున్నారు. అయితే అపరిశుభ్ర చేతులతోనే మనం ట్యాప్ ఆన్ చేస్తాం కాబట్టి. ఆ చేతులకు ఉన్న బ్యాక్టీరియా, వైరస్ లు ట్యాప్ నకు అంటుకునే అవకాశం ఉంది. నిరంతరం కోవిడ్ 19 పేషెంట్ల మధ్యలో తిరిగే డాక్టర్లు, నర్సులు, క్లీనర్స్, అంబులెన్స్ డ్రైవర్స్ లు చేతులు కడుక్కునే సమయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. వీటిని దృష్టిలో పెట్టుకుని లేహ్ జిల్లాలోని, దొమ్ ఖర్ గ్రామానికి చెందిన తామోస్ గుర్మీత్ ‘ఇన్ఫెక్షన్ ఫ్రీ ట్యాప్’ ను రూపొందించారు.

సోప్ అండ్ వాటర్:

ఈ పరికరాన్ని స్టీల్ తో తయారు చేశాడు. ఈ డివైజ్ అడుగు భాగంలో రెండు ఫుట్ ప్రెస్ లు ఉంటాయి. రైట్ ఫుట్ ప్రెస్ నొక్కితే.. సోప్ వాటర్ వస్తాయి. లెఫ్ట్ ఫుట్ ప్రెస్ నొక్కితే .. నార్మల్ వాటర్ వస్తాయి. దీని వల్ల వాటర్ కూడా 80 శాతం వరకు సేవ్ అవుతాయి. ఈ డివైజ్ లో ఇన్సులేటెడ్ వాటర్ ట్యాంకును ఉపయోగించాడు. దాంతో గోరువెచ్చని నీళ్లు వస్తాయి. ట్యాంకు సామర్థ్యం 20 లీటర్లు. దీన్ని తయారు చేయడానికి గుర్మిత్ కు ఐదు రోజులు పట్టింది. ఈ డివైజ్ వెయిట్ 70 కిలోలు ఉంటుంది. లేహ్ లోని ‘సోనమ్ నోర్బో మెమొరియల్ ఆస్పత్రి’ వైద్య బృందం దీన్ని ఉపయోగిస్తున్నారు. హోటళ్లు, ఎయిర్ పోర్ట్ అథారిటీ, ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఆర్డర్లు వచ్చాయని గుర్మీత్ తెలిపాడు. ‘ఓ వైద్యుడు కరోనా వైరస్ భారిన పడటంతో.. వైద్య సిబ్బందికి ఏం కాకూడదనే భావనతో నేను ఈ యంత్రాన్ని కనిపెట్టాను’ అని గుర్మిత్ చెప్పాడు.

tags :coronavirus, infection free tap, leh

Advertisement

Next Story