పిల్లల్లో పోషకాహార లోపం.. కారణం అదేనా.. ?

by Shyam |
పిల్లల్లో పోషకాహార లోపం.. కారణం అదేనా.. ?
X

దిశ, ఫీచర్స్ : రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు అవసరమైన పోషకాహారం లభించడం లేదని, ఇది ‘ఇర్రివర్సబుల్ డెవలప్‌మెంటల్ హార్మ్’కు దారితీస్తుందని యునిసెఫ్ కొత్త నివేదిక వెల్లడించింది. ప్రారంభ జీవితంలో పిల్లల ఆహార సంక్షోభం ‘ఫెడ్ టు ఫెయిల్?’ అనే టైటిల్‌తో ఈ నెల 23న న్యూయార్క్‌లో జరగనున్న యూఎన్ ఫుడ్ సిస్టమ్స్ సమ్మిట్‌కు ముందే దీన్ని రిలీజ్ చేశారు. పెరుగుతున్న పేదరికం, అసమానత, వాతావరణ సంబంధిత విపత్తులతో పాటుగా కొవిడ్ వంటి అత్యవసర పరిస్థితులు చిన్నపిల్లల్లో పోషకాహార సంక్షోభానికి ఎలా దోహదం చేస్తున్నాయో ఇందులో వివరించారు.

యునిసెఫ్ అందించిన ఈ నివేదిక 91 దేశాల్లోని పిల్లల పోషకాహార సమస్య గురించి అధ్యయనం చేయగా, 6-23 నెలల మధ్యగల సగం మంది పిల్లలకు మాత్రమే ప్రతీరోజు ‘మినిమం రికమండెడ్ నెంబర్ ఆఫ్ మీల్స్’ అందుతున్నాయని గుర్తించారు. చిన్నారుల్లో మూడింట ఒకవంతు మాత్రమే ‘వృద్ధి చెందడానికి అవసరమైన కనీస ఆహార పదార్థాలు’ తీసుకుంటున్నారని తేలింది. అయితే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను కొవిడ్ ప్రభావితం చేయడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు, జకార్తాలోని పట్టణ గృహాల్లో నిర్వహించిన ఒక సర్వేలో.. సగం కుటుంబాలు పోషకాహార కొనుగోళ్లను సగానికి పైగా తగ్గించారు. ఇలా పోషకాలు సరిగా అందకపోతే పిల్లల్లో మెదడు అభివృద్ధి చెందకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు పెరగడం, బరువు తగ్గిపోవడంతో పాటు పొటెన్షియల్లీ డెత్ వంటి ప్రమాదాలకు గురవుతారని పరిశోధకులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా పేద కుటుంబాలకు చెందిన 6-23 నెలల వయసున్న పిల్లలు.. ‘పట్టణ’ లేదా ధనవంతులైన తోటివారితో పోలిస్తే వెరీ పూర్ డైట్ తీసుకుంటున్నారని నివేదిక పేర్కొంది.

సాధించిన పురోగతి సరిపోదు..

పుట్టిన తర్వాత మొదటి రెండేళ్లలో పోషకాహారం తీసుకోకపోతే అది పిల్లల ఎదుగుదలపై తీవ్రప్రభావం చూపుతుంది. వేగంగా పెరుగుతున్న శరీరాలకు, మెదడుకు దీనివల్ల కోలుకోలేని హాని కలుగుతుంది. కొన్నేళ్లుగా దీనిపై శ్రద్ధ వహిస్తుండటంతో పోషకపూరిత, సురక్షిత ఆహారాన్ని అందించడంలో కొంచెం పురోగతి సాధించాం. కానీ కొనసాగుతున్న COVID-19 అంతరాయాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి’
– హెన్రిట్టా ఫోర్, యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

Advertisement

Next Story