జలుబు రావొద్దంటే సెక్స్ చేయాల్సిందే..

by sudharani |   ( Updated:2021-12-16 11:13:34.0  )
dialy romance
X

దిశ, డైనమిక్ బ్యూరో : మనిషికి మానసిక ప్రశాంతత ఎంత అవసరమో.. శారీరక సుఖం అంతే అవసరం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అధికంగా పనిచేసి శృంగార క్రీడను మర్చిపోతున్నారు. రాత్రంతా ఉద్యోగం చేయడం.. పొద్దుందాక పడుకోవడం ఇది మాత్రమే జీవితం అనుకుంటున్నారు. దీంతో పెళ్లి చేసుకున్నా.. సుఖాన్ని అనుభవించలేక దాంపత్య జీవితానికి ఎండ్ కార్డ్ వేసేస్తున్నారు. పెళ్లి అయిన మూన్నాళ్లకే విడాకులు తీసుకుంటున్నారు. ఇది మరింత ప్రమాదం అవ్వకముందే జంటలు గ్రహించి సుఖసంతోషాలతో కలిసి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పని ఒక్కటే జీవితం కాదని, పని చేసి అలసిపోయిన శరీరానికి శృంగారం ఉపశమనాన్ని ఇస్తుందని చెబుతున్నారు.

Cold sex,

శృంగారంలో ఎంత పాల్గొంటే అంతగా ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉండొచ్చని పరిశీలనలో తేలిందన్నారు. అంతేకాకుండా డైలీ శృంగారంలో పాల్గొనేవారు వ్యాయామం చేయాల్సిన అవసరం కూడా లేదని, ఒత్తిడి కూడా తగ్గిపోతుందని సూచించారు. కానీ, సెక్స్ చేయడం వల్ల కొత్తగా మరో లాభం ఉందటున్నారు నిపుణులు. ప్రస్తుతం శీతాకాలం కావడంతో చాలా మందికి జలుబు అనేది సహజంగా వస్తుంటుంది.

అయితే, జలుబు రాకుండా ఉండేందుకు సెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందనేది పలు అధ్యయనాల్లో తేలిందని చెబుతున్నారు. ఎందుకంటే, వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారి లాలాజలంలో జలుబుతో పోరాడే యాంటీబాడీలు పెద్దమొత్తంలో ఉంటాయంట. కానీ, ఇన్ని లాభాలున్న శృంగారాన్ని మాత్రం బిజీ లైఫ్‌లో పక్కన పెడుతున్నారని, ప్రతి ఒక్కరూ సెక్స్‌లో పాల్గొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Sex: సెక్స్ సమయంలో ఆడవాళ్లు గ్రహించే విషయాలు ఇవే..

Advertisement

Next Story

Most Viewed