సమంతలా ఉంటేనే టాలీవుడ్‌లో ప్లేస్ : రాశి

by Jakkula Samataha |
సమంతలా ఉంటేనే టాలీవుడ్‌లో ప్లేస్ : రాశి
X

దిశ, సినిమా : తమిళ్, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న రాశీ ఖన్నా.. సౌత్ ఇండస్ట్రీలో రాణించాలంటే అందం ఒక్కటే సరిపోదని అభిప్రాయపడింది. ‘ఊహలు గుసుగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన భామ.. ఆ తర్వాత ఎక్కువగా కమర్షియల్ మూవీస్‌లో నటించడంతో పర్ఫార్మెన్స్‌కు స్కోప్ దక్కలేదు. అయితే వరుసగా ‘తొలిప్రేమ, వెంకీ మామ, వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో నటిగానూ మార్కులు కొట్టేసింది. ఇది మేల్ డామినేషన్ ఇండస్ట్రీ అయినప్పటికీ, కొత్తదనం ఉన్న సినిమాలతో ఫిమేల్ యాక్టర్స్ ముందుకు సాగుతున్నారన్న రాశి.. ‘తొలిప్రేమ’ తర్వాతే తను నటించగలననే విషయం అందరికీ అర్థమైందని తెలిపింది.

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ కెరియర్ కొనసాగించాలంటే ‘అనుష్క శెట్టి, సమంత అక్కినేని’ ఆదర్శంగా తీసుకోవాలని.. వీరిద్దరూ సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల పట్ల అంతకుముందున్న అభిప్రాయాన్ని చెరిపేశారని వెల్లడించింది. గతంలో అందంగా, పాటల్లో గ్లామరస్‌గా కనిపించాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు మంచి నటిగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. దక్షిణాదిన అలాంటి నటీమణులు చాలామందే ఉన్నారని, దీన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పుకొచ్చింది. కాగా ఈ భామ నాగచైతన్యతో ‘థాంక్యూ’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story