- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీ, కోహ్లీ మోసం చేశారు : యువీ తండ్రి
న్యూఢిల్లీ: గతంలో పలుమార్లు ఎంఎస్ ధోనీపై తన అక్కసు వెల్లగక్కిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్.. తాజాగా మరోసారి అదే తరహా వ్యాఖ్యలతో ధోనీ, కోహ్లీలపై విరుచుకుపడ్డాడు. ‘యువీ కెరీర్ కష్టకాలంలో ఉన్నప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ అతడికి అండగా నిలవలేదని, వారిద్దరూ తన కొడుకును మోసం చేశారని’ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక జాతీయ పత్రికతో మాట్లాడిన యోగ్‌రాజ్.. పలు ఆరోపణలు చేశారు. వీరిద్దరే కాకుండా అప్పటి సెలెక్టర్ శరణ్‌దీప్ కూడా యువరాజ్‌ను జట్టునుంచి తప్పించేందుకే చూశాడని ఆరోపించాడు. ‘క్రికెట్‌లో ఓనమాలు తెలియని వాళ్లు కూడా సెలెక్టర్లు కావడం మా దురదృష్టం’ అని సెలెక్షన్ కమిటీ నిర్ణయాలను విమర్శించాడు. ధోనీ, కోహ్లీ వెన్నుపోటు కారణంగానే యువరాజ్ కెరీర్ నాశనమైందని వ్యాఖ్యానించాడు.
కాగా, గతంలోనూ యువరాజ్ తండ్రి వీరిద్దరిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ‘2011 వరల్డ్ కప్ సమయంలో యువరాజ్ బదులు రైనాను తీసుకోవాలని ధోనీ తీవ్రంగా ప్రయత్నించాడని అన్నాడు. ఎందుకంటే.. ఆ టోర్నీలో కనుక యువరాజ్ రాణిస్తే తమ స్థానాలకు ఎసరు వస్తుందనే అభద్రతా భావంలో వారుండేవారని చెప్పాడు. కాగా, యోగ్‌రాజ్ వ్యాఖ్యలపై అటు ధోనీ, కోహ్లీ గానీ.. ఇటు యువరాజ్ గానీ ఇంకా స్పందించలేదు.
Tags : MS Dhoni, Virat Kohli, Yuvraj, Yograj, Cricket, Team India