కస్టమర్లకు ‘యెస్‌ బ్యాంక్’ గుడ్ న్యూస్..

by Shamantha N |
కస్టమర్లకు ‘యెస్‌ బ్యాంక్’ గుడ్ న్యూస్..
X

కస్టమర్లకు యెస్ బ్యాంక్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇన్నిరోజులు యెస్ బ్యాంకు‌పై విధించిన మారటోరియంను ఆర్‌బీఐ మార్చి18 బుధవారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఎత్తివేసింది. దీంతో తమ వినియోగదారులకు అన్నిరకాల సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు బ్యాంక్ వెల్లడించింది. మారటోరియం వలన యెస్ బ్యాంకు కస్టమర్లు రోజుకు రూ.50వేలకు మించి నగదు తీసుకోవడానికి వీళ్లేదు. దీంతో చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు. ఇన్నిరోజులు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. మార్చి 19నుంచి 21వరకు ఉదయం 8.30గంటల నుంచే బ్యాంకు తెరుచుకుంటుందని, అలాగే రెండ్రోజులు సీనియర్ సిటిజన్స్ కోసం సాయంత్రం 5.30వరకు సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు యెస్ బ్యాంకు ప్రకటించింది. ఇదిలాఉండగా యెస్ బ్యాంకు తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోవడం, ఆర్‌బీఐ మారటోరియం విధించడం, కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం, దిగ్గజ రంగ ప్రయివేటు బ్యాంకులు పెట్టుబడులు పెట్టడంతో యెస్ బ్యాంకు మాములు స్థితికి చేరుకుంది.

Tags: yes bank , good news to customers, central govt, rbi, moratorium remove

Advertisement

Next Story