- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కేసులో వాధవన్ సోదరులకు బెయిల్ మంజూరు!
దిశ, వెబ్‌డెస్క్: యెస్ బ్యాంకు కేసు వ్యవహారంలో 60 రోజుల వ్యవధిలోగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమైన నేపథ్యంలో దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రమోటర్లు కపిల్ వాధవన్, ధీరజ్ వాధవన్‌లకు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. యెస్ బ్యాంకు ఫ్రాడ్ కేసులో వారిద్దరూ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఒక్కొక్కరూ రూ.లక్ష డిపాజిట్ చేయడమే కాకుండా తమ పాస్‌పోర్టులను అప్పగించాలని పేర్కొంది.
కానీ, కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కపిల్ వాధవన్, ధీరజ్ వాధవన్‌లు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏరపడింది. ఈడీ కేసులో మాత్రమే కోర్టు బెయిల్ మంజూరు చేసినా, ఇదే కేసులో సీబీఐ కేసు ఇంకా కొనసాగనుంది. మే 14న మనీలాండరింగ్ కేసులో వాధవన్ సోదరులిద్దరినీ ఈడీ అరెస్ట్ చేసింది. తర్వాత జులై 15వ తేదీన వాధవన్ సోదరులు, యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడైన్ రానా కపూర్, ఆయన కుటుంబంపై, చార్టెడ్ అకౌంటెంట్ దుల్రేష్ జైన్ సహా సహచరులపై ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. రుణాలను మంజూరు చేయడంలో అనుమానాలు, క్విడ్ ప్రో కో తరహా లావాదేవీలు జరిగినట్టు ఈడీ ఛార్జీషీట్‌లో వెల్లడించింది.