- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ పని చేసినందుకు జాతీయ పార్క్ నుంచి బ్యాన్!
దిశ, వెబ్‌డెస్క్ : స్థానికంగా పార్కులు, సందర్శన కేంద్రాల్లో చేయకూడని పనులు.. అంటే మొక్కల పూలు తుంచడం, సహజ వనరులను డిస్టర్బ్ చేయడం వంటివి చేసినపుడు జరిమానాలు, నిషేధాలు విధిస్తుంటారు. చిన్న చిన్న పార్కులకే ఇంత కఠినమైన నిబంధనలు ఉంటే అమెరికాలోని ప్రతిష్టాత్మక ఎల్లోస్టోన్ పార్క్‌లో అలాంటి పనులు చేస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అక్కడ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని హాట్ స్ప్రింగ్స్ స్థితికి ఇబ్బంది కలిగించేలా ఏదైనా చేస్తే చాలా తీవ్రమైన తప్పుగా పరిగణిస్తారు. ఇటీవల ఓ వ్యక్తి.. షోషోన్ గీజర్ వద్ద ఒక పని చేసి, రెండేళ్ల పాటు పార్కుకు రాకుండా నిషేధించబడ్డాడు. ఇంతకీ అతనేం చేశాడంటే.. హాట్ స్ప్రింగ్స్‌లో చికెన్ ఉడకపెట్టడానికి ప్రయత్నించాడు. హాట్ స్ప్రింగ్స్‌లో ఏదైనా వస్తువు వేయడం వల్ల దాని సహజ స్థితికి ఆటంకం కలిగి అవి పేలిపోయి, మొత్తం పార్క్ జీవావరణ స్థితి నాశనమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే హాట్ స్ప్రింగ్స్ వద్ద ఏది పడితే అది చేయడానికి సందర్శకులకు అనుమతి ఉండదు. హైకింగ్ కోసం వచ్చి అక్కడ చికెన్ ఉడకబెట్టిన ఈ సందర్శకునికి నిషేధం విధించడంతో పాటు 600 డాలర్ల ఫైన్ విధించారు.