మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!

by Harish |   ( Updated:2020-03-28 07:22:07.0  )
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఆందోలనలను పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దేశాలన్నీ పలు చర్యల్ని తీసుకుంటున్నాయి. అయితే, కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో మదుపర్లు ఎక్కువగా రక్షణాత్మక ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నారు. మార్కెట్లు పతనాన్ని అధిగమించేందుకు మదుపర్లు అత్యధికంగా బంగారంపై ఆసక్తి చూపిస్తున్నారు. శుక్రవారం ఎంసీఎక్ మార్కెట్లో రూ. 770 పెరిగిన బంగారం పదిగ్రాములు రూ. 43,570 వద్ద క్లోజయింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఔన్స్ బంగారం 9 డాలర్లు పెరిగి 1,630 వద్ద ముగిసింది.

విదేశీ మారక ద్రవ్యం:

మరోవైపు దేశీయంగా ఆర్థిక మాంద్యం దెబ్బకు విదేశీ మారక నిల్వలు భారీ స్థాయిలో తగ్గిపోయాయి. గత వారం నమోదైన గణాంకాల ప్రకారం 2008 తర్వాత కేవలం ఒక్క వారానికి అత్యధికంగా విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. మార్చి 20 తో ముగిసిన వారంలో విదేశీ మారక ద్రవ్యం సుమారు 12 బిలియన్ డాలర్లు తగ్గి 469 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న డాలర్లను విక్రయించడంతో ఫారెక్స్ నిల్వలు భారీగా తగ్గాయని, జీవిత కాల కనిష్ఠాలను నమోదు చేస్తున్న క్లిష్ట సమయంలో ఫారెక్స్ డాలర్లను విక్రయించడం కారణంగాఏ డాలర్ మారకంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed