రూ. 44 వేలకు చేరువలో బంగారం!

by Harish |   ( Updated:2020-04-03 11:03:52.0  )
రూ. 44 వేలకు చేరువలో బంగారం!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో మార్కెట్లు కుదేలవుతుండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా మదుపర్లు అమ్మకాల జోరును పెంచారు. మార్కెట్లపై నమ్మకం సడలి బంగారంపై ఆసక్తి చూపిస్తున్నారు. సంక్షోభం కొనసాగుతున్న సమయంలో షేర్ల కంటే సురక్షితమైన బంగారంలో పెట్టుబడి పెట్టడం నయమని పెట్టుబడిదారులు సైతం భావిస్తున్నారు. శుక్రవారం కమొడిటీ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 530 పెరిగి రూ. 43,770కి చేరుకుంది. బంగారం బాటలోనే వెండి సైతం రూ. 1,348 పెరిగి రూ. 41,222 కి చేరుకుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కొద్ది వారాల్లోనే బంగారం ధర రూ. 45,000కి చేరుకునే అవకాశముందని ట్రేడర్లు భావిస్తున్నారు.

Tags: gold price, gold price, commodity market, silver

Advertisement

Next Story

Most Viewed