- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జర్నలిస్టుల ముందే విషం తాగిన వైసీపీ మహిళా నేత
దిశ, వెబ్ డెస్క్: వైసీపీలో కొంత మంది వ్యక్తులు తనను మోసం చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ విషం సేవించింది. వివరాల్లోకి వెళ్లే.. విజయవాడలోని గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో సోమవారం వైఎస్సార్ సీపీ కార్యకర్త బొల్లిపల్లి జోనికుమారి మీడియాతో మాట్లాడారు. వైసీపీని తాను సొంత కుటుంబంలా భావించానని, కానీ, కొందరు నేతలు తననకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ విషయమై సీఎం జగన్‌ను కలుద్దామని భావించినా.. కరోనా పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదన్నారు.
జులై 6న ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశానని, ట్విటర్ ద్వారా కూడా సీఎం జగన్‌కు దృష్టికి తీసుకెళ్లానని.. అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నా చావే పరిష్కారం అంటూ.. అకస్మాత్తుగా విషం తాగారు. తన వెంట విషం బాటిల్ తెచ్చుకొని మీడియాకు కనిపించకుండా దాచుకున్నారు. మాట్లాడిన తర్వాత.. వెంటనే బాటిల్ తీసి విషం తాగారు. తనను ఎవరూ ఆస్పత్రికి తీసుకెళ్లవద్దని ఆమె కోరారు. ఇది గమనించిన మీడియా ప్రతినిధులు, పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో విజయవాడ ప్రెస్ క్లబ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఆ మహిళా నేతకు ఎవరు అన్యాయం చేశారు? ఎందుకు ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చింది? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ అంశంపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.