- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ సెషన్స్.. వైసీపీ ఎంపీలకు షాక్
దిశ, వెబ్ డెస్క్: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. కరోనా విజృంభిస్తున్న కారణంగా తగిన చర్యలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిబ్బంది నుండి ఎంపీల వరకు కరోనా టెస్టులు చేయించుకుని నెగెటివ్ వచ్చిన సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీలకు పార్లమెంట్ సెక్రటేరియట్ కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఏపీకి చెందిన ముగ్గురు వైసీపీ ఎంపీలకు షాక్ తగిలింది. అరకు ఎంపీ మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప లకు, కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఎంపీ మాధవికి జ్వరం లక్షణం ఉండగా… వంగా గీత, రెడ్డప్ప లకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా నిర్ధారణ అయింది. వీరిని ఐసోలేషన్ లోనే ఉండాలని వైద్య అధికారులు సూచించారు. ఈ ముగ్గురు వైసీపీ ఎంపీలు రెండు వారాల పాటు ఢిల్లీలోనే ఉండి చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది.