రోడ్డు ప్రమాదంలో.. ఆ ఎమ్మెల్యేకు గాయలు

by Anukaran |
రోడ్డు ప్రమాదంలో.. ఆ ఎమ్మెల్యేకు గాయలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం చెన్నై నుంచి గూడురుకు వస్తుండగా నాయుడుపేట వద్ద ఎమ్మెల్యే కారు, లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ హరికి తీవ్ర గాయాలు, వరప్రసాద్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే హరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే వరప్రసాద్‌ను చెన్నైకి తరలించారు. ఎమ్మెల్యే కారు ముందుగా వెళుతున్న ఓ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Next Story