కేంద్ర మంత్రి వర్గంలోకి వైసీపీ !

by Anukaran |
కేంద్ర మంత్రి వర్గంలోకి వైసీపీ !
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ.. ఎన్డీయేలో చేరబోతుందా ! త్వరలో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణలో వైసీపీకి పదవులు దక్కనున్నాయా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సడన్‌గా ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్ సమావేశం ఖరారు కావడాన్ని చూస్తే… ఎన్డీయేలో వైసీపీని భాగస్వామి చేసుకునేందుకే ప్రధాని మోడీ నుంచి పిలుపు వచ్చిందని ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారని విశ్లేషకులు భావిస్తున్నారు. పదిరోజుల క్రితమే రెండ్రోజులు పాటు ఢిల్లీలో పర్యటించి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో రెండు సార్లు భేటీ అయిన జగన్.. మళ్లీ ఢిల్లీ పర్యటన చేపట్టి ప్రధానితో భేటీ కాబోతుండటంతో ఎన్డీయేలో వైసీపీ చేరబోతుందనే విషయానికి బలం చేకూరింది.

అమిత్ షాతో భేటీ సందర్భంగానే క్లారిటీ ఇచ్చిన సీఎం.. మళ్లీ ప్రధాని మోడీతో సమావేశం సందర్భంగా కేంద్రమంత్రి పదవులపైనే కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావల్సిన పెండింగ్ బకాయిలతో పాటు, పోలవరానికి నిధులపైనే చర్చిస్తారని అధికారిక సమాచారం ఉన్నా అమరావతి భూములతో పాటు, ఫైబర్‌ కనెక్షన్‌లో జరిగిన మోసాలపై సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే వైసీపీ… ఎన్డీయేలో చేరితే ఐదు కేంద్రమంత్రి పదవులు అడుగుతున్నట్లు తెలుస్తుండగా మూడు పదవులు కట్టబెట్టేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

Next Story