‘ మద్యపాన నిషేధం అటకెక్కింది ’

by srinivas |   ( Updated:2021-04-01 02:54:06.0  )
‘ మద్యపాన నిషేధం అటకెక్కింది ’
X

దిశ, వెబ్ డెస్క్ : పేదల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ అస్మదీయుల జేబులు నింపుతున్న మీ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అటకెక్కించినట్టేనా అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజలనుంచి డబ్బులను గుంజుతుందన్నారు. ఎన్నికల ముందు మద్యపానం నిషేధిస్తామని హామీ ఇచ్చి దాన్ని అటకెక్కించారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం రేట్లు విపరీతంగా పెంచారని, దీని వలన పేద కుటంబాల పై తీవ్ర ప్రభావం చూపుతుందని మండిపడ్డారు.
గతం కంటే క్వార్టర్ మందు సీసా‌ ఖర్చు రెట్టింపైంద‌ని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పాల‌న‌లో క్వార్టర్ కు రూ.100 ఉండ‌గా, ప్రస్తుతం రూ.200 నుంచి 250 ఉంద‌ని చెప్పారు. సగటున రోజువారీ కూలి రూ.400 అని, క్వార్టర్‌కు మించి తాగినరోజు కూలీలు పస్తులు ఉండాల్సిందేన‌ని చెప్పారు. అంత డ‌బ్బుపెట్టలేనివారంతా నాటు వైపు వెళ్తున్నార‌ని, జోరుగా ఎన్‌డీపీఎల్‌ అమ్మకాలు జ‌రుగుతున్నాయ‌ని దేవినేని ఉమ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed