హోంమంత్రి సుచరితకు షాకిచ్చిన కార్యకర్తలు

by srinivas |

ఏపీ హోంమంత్రి సుచరితకు సొంత పార్టీ కార్యకర్తలే షాక్ ఇచ్చారు. ఇవాళ ఉదయం గుంటూరులోని ఆమె నివాసాన్ని ముట్టడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 27వ డివిజన్ టికెట్‌ను రౌడీషీటర్‌కు కేటాయించారని.. కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం శ్రమించే యోగేశ్వర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కార్యకర్తల ఆందోళనలతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Tags: home minister, sucharitha ycp, activists, protest

Advertisement

Next Story

Most Viewed