తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్

by Anukaran |   ( Updated:2020-12-07 07:03:55.0  )
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఈనెల 27నుంచి యాసంగీ సీజన్ రైతుబంధు సాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేస్తామని వెల్లడించారు. సోమవారం ప్రగతిభవన్‌లో వ్యవసాయశాఖ, ఆర్థికశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. రైతుబంధు సాయం కోసం నిధులు, పంపిణీపై చర్చించారు. ఈ మేరకు రూ.7,300 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం అందిస్తామని, నేరుగా రైతుల ఖాతాల్లో నగదు చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story