భార్య నగ్నచిత్రాలతో సినీ రచయిత బ్లాక్ మెయిల్

by Sumithra |   ( Updated:2020-09-07 02:49:42.0  )
భార్య నగ్నచిత్రాలతో సినీ రచయిత బ్లాక్ మెయిల్
X

దిశ, వెబ్‌డెస్క్ : అతనో క్రియేటివిటీ రచయిత. తన క్రియేటివిటీని సినీ కథలపై పెడితే మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేవి. కానీ తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపైనే తన ‘క్రియేటివిటీ’ని ప్రదర్శించి పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం..

సినీ రచయిత యర్రంశెట్టి రమణ ఏడాది క్రితం ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి సంసారంలో కలతలు ప్రారంభమయ్యాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

మళ్లీ కాపురం పెట్టిన వీరి మధ్య తాజాగా గొడవలు ప్రారంభమయ్యాయి. రమణ తరుచూ భార్యపై వేధింపులకు పాల్పడుతూ మానసికంగా హింసిస్తున్నాడు. తనపై పెట్టిన కేసును వాపస్ తీసుకోకపోతే తన నగ్న చిత్రాలను యూట్యూబ్ లో పెడతానని బెదిరింపులకు దిగాడు. విసిగిపోయిన ఆమె సోమవారం మరోమారు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story